అన్నమయ్య: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ వి.జె. రామకృష్ణ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని కొనియాడారు. రాజకీయాల్లో సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.