MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక BRS నాయకులు, బాల్క సుమన్ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మందమర్రి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల్ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బాల్క సుమన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.