SKLM: ఆక్వా కల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి వీసీలో సమీక్ష నిర్వహించారు. రైతులు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు. రైతుల ఆదాయాన్ని కాపాడుతూ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.