VSP: వైసీపీ జిల్లా లీగల్ సెల్ విస్తృత స్థాయి సమావేశం సీతమ్మధారలో గురువారం నిర్వహించారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాజి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఆశయాలతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే, రాజ్యాంగ పరిరక్షణకు లీగల్ సెల్ ముందుండాలన్నారు.