SRPT: హుజూర్ నగర్‌కు చెందిన ఉపేంద్రమ్మ అనే మహిళకు చెందిన మేక నెల రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండగా కోదాడ ప్రాంతీయ పశువైద్య శాలకు తరలించారు. పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీ. పెంటయ్య ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించి, దాని పొట్టలో నుంచి సుమారు మూడు కిలోల ప్లాస్టిక్ కవర్లను విజయవంతంగా తొలగించారు.