MDK: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇప్పటివరకు 62,103 మంది రైతుల నుంచి 2,85,054 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. 43,433 మంది రైతుల ఖాతాల్లో రూ.468.18 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 30 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయ్యిందని, అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.