HNK: హన్మకొండ కలెక్టరేట్లో గురువారం జిల్లా ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరై కొనుగోళ్ల పురోగతిపై చర్చించారు. ములుగు జిల్లా కలెక్టర్ బొర్ఖడే హేమంత్ సహదేవరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.