TG: NTR స్ఫూర్తితోనే ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు చీరల పంపిణీ అని సీఎం రేవంత్ అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని, ఇందిరమ్మ ఒక తరమైతే.. ఎన్టీఆర్ ఒక శకమని కొనియాడారు. అమెరికా వంటి దేశాలనే హెచ్చరించి, ప్రపంచ దేశాల ముందు భారత్ తలఎత్తుకునేలా చేసిన ధీర వనిత ఇందిరాగాంధీ అని, ప్రస్తుత ప్రధానుల్లా ఆమె యుద్ధాల్లో లొంగిపోలేదని సీఎం పేర్కొన్నారు.