KDP: ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టల గ్రామ సమీప పంట పొలాలలో విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. స్తంభాలు నేల వాలి ఉండటం వల్ల తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదాలు చోటుచేసుకునే విధంగా ఉన్నాయని రైతులన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా స్పందన లేదని రైతులన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోపు సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.