E.G: వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకొండ నార్త్ జోన్ DSP సీహెచ్ జీవన తెలిపారు. ప్రమాదకరమైన మలుపులలో వేగం తగ్గించి ప్రయాణించాలని సూచించారు. ఇందుకుగాను కొత్తపల్లి వద్ద ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన రోడ్డు మలుపు వద్ద ఇసుకతో కూడిన డ్రమ్ములను DSP స్వయంగా ఏర్పాటు చేశారు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరారు.