ASR: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ ఆధ్వర్యంలో పాడేరులో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. బైకర్లు హెల్మెట్ ధరించాలని సూచించారు.