NRPT: బెంగళూరులో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన కనకప్ప ప్రతిభ కనబరిచాడు. టీ-44 విభాగంలో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో 12.99 టైమింగ్తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించాడు. క్రీడల్లో మరింత రాణిస్తూ, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కుటుంబ సభ్యులు గ్రామస్థులు కనకప్పను అభినందించారు.