AKP: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపుపై అవగాహన కల్పించేందుకు నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లిలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సీహెచ్.తలుపులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు.