W.G: కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రసాదశాల నిర్మాణానికి భీమవరానికి చెందిన కనుమూరు కృష్ణంరాజు గురువారం రూ.5,00,000 విరాళం అందించారు. తన భార్య అచ్చాయమ్మ పేరున ఆయన ఈ నిధులు అందజేసినట్లు ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ తెలిపారు. దాతకు ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి ప్రతిమతో సత్కరించారు.