MDK: కేరళ మాజీ సీఎం పినరై విజయన్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కోరేంకల మల్లేశం తీవ్రంగా ఆరోపించారు. ఈ చర్యకు నిరసనగా గురువారం పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు.