MBNR: గ్రామ గ్రామాన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని బలోపేతం చేస్తామని జిల్లా ఇంఛార్జ్ మెట్టుకాడి ప్రభాకర్ వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.