NRPT: నారాయణపేట ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య పరీక్షల శిబిరం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఉదయం 9:40 గంటలకు ‘ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.