AP: మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ MP విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి ED విచారణకు హాజరైన ఆయన్ను అధికారులు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో తాను ఎవరి పేర్లు చెప్పలేదని, రాజ్ కెసిరెడ్డికి అన్ని విషయాలు తెలుసని మాత్రమే చెప్పానన్నారు. గతంలో ED సోదాల్లో తన ఇంట్లో దొరికిన రూ.6 లక్షలను ఇవాళ అధికారులు తిరిగి ఇచ్చారని తెలిపారు.