అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని పెద్ద మసీదు, బ్రాహ్మణపల్లి ఈద్గాలలో గురువారం జరిగిన బక్రీద్ సామూహిక ప్రార్థనల్లో YCP జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ త్యాగానికి, సహనానికి ప్రతీక అని, నియోజకవర్గం ఎల్లప్పుడూ మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.