SRD: ఖేడ్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేతుల మీదుగా ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మే 14న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన విషయం తెలిసింది. ఇందులో కళ్లజోడు అవసరమైన వారిని కంటి వైద్యులు గుర్తించగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉన్నారు.