W.G: ప్రతి మహిళా ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని వైద్యులు పి.ప్రసన్న, ఎన్.నిహారిక, బి.కల్యాణి సూచించారు. ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం వీరవాసరం కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నెలసరి సమయంలో మహిళలు పాటించాల్సిన పరిశుభ్రత, తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.