NZB: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులను నిరసిస్తూ సీపీఎం NZB జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, పెద్ది వెంకట్రములు, సుజాత, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.