KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేట పట్టణంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్ స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేట ఎఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే పర్యవేక్షణలో సి.ఐ నాగార్జున మహిళలకు ‘శక్తి’ యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై వివరించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు.