సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం సంతేబిదనూరు గ్రామ పంచాయతీకి చెందిన వైసీపీ నాయకుడు ఆంజనేయులు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి గురువారం వారి నివాసానికి వెళ్లి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.