VZM: జిల్లాలో బక్రీద్ పండగ ప్రశాంతంగా ముగిసిందని SP దామోదర్ గురువారం తెలిపారు. పండగ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మత సామరస్యాన్ని చాటారని పేర్కొన్నారు. మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతను పర్యవేక్షించినట్లు తెలిపారు. ప్రార్థనలకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.