కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో హైవే పక్కన మంగళాపురం రోడ్డులో రావెళ్ల ఉదయ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు గురువారం ప్రారంభించారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు పోటీలు ప్రారంభించారు. ఎన్టీఆర్, మండలి వెంకట కృష్ణారావు, రావెళ్ల కృష్ణ చిత్రపటాలకు నివాళులర్పించారు. యువతను క్రీడల దిశగా ప్రోత్సహించటం శుభ పరిణామమన్నారు.