BHPL: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాల్లో పాల్గొన్న కాశీ పండితులు గురువారం పవిత్ర పుష్కర స్నానం చేశారు. అనంతరం ప్రధాన దేవాలయంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆశీర్వచనం వేదిక వద్ద ఏడుగురు కాశీ పండితులకు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు.