NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 21 మంది నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు TASK ప్రతినిధులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో టాస్క్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 21 మంది ఈ ఉద్యోగాలను సాధించినట్లు టాస్క్ సభ్యులు వివరించారు.