SKLM: కృషి, క్రమశిక్షణతోనే లక్ష్య సాధన సాధ్యమని ఎన్సీసీ 14వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ శశాంక్ కుష్వాహ్ అన్నారు. నౌపడ ప్రణవి డిగ్రీ కళాశాలలో నూతన ఎన్సీసీ సబ్ యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. యువత ఎన్సీసీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ డా. పేడాడ పరమేశ్వరరావు, ప్రిన్సిపల్ ఆర్.రామారావు పాల్గొన్నారు.