ADB: జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. లాటరీ ద్వారా ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. లాటరీ విధానాన్ని వెంటనే రద్దు చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.