HNK: ఐనవోలు(M)లోని పంతిని గ్రామంలోని చెరువులో అనుమతి లేకుండా మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్న మొరం ట్రాక్టర్లు, జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు అయినవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనాలను స్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్నారని గ్రామస్తులు తెలిపారు.