శ్రీకాకుళం మండలం చింతాడ రెవెన్యూ పరిధిలోని వంశధార కుడి కాలువలో పూడికతీత పనులను గురువారం ప్రారంభించారు. నీటి సంఘాల అధ్యక్షుడు కె. చిన్నారావు మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశధార డీఈ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కంచు దశరథ, 6వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ ఫాతిన వెంకటరమణ పాల్గొన్నారు.