KDP: వేముల మండలం మీధిపెంట్లలో అకాల వర్షం, ఈదురు గాలుల వల్ల దెబ్బతిన్న అరటి పంటలను గురువారం ఎంపీ అవినాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సతీశ్ కుమార్ రెడ్డి మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.