BHPL: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో విజిలెన్స్ ఎస్పీ శశిధర్ రాజు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.