ADB: ఏఐటీయూసీ తోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ అన్నారు. గురువారం భారత రాష్ట్ర కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నగేష్తో పాటు పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. వారికి కండువాలు కప్పి సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు. సమిష్టిగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని దేవేందర్ పిలుపునిచ్చారు.