TG: రాష్ట్రంలో అర్హులైన పౌరుల కోసం ఆధార్ తరహాలో ఒకే ఒక ‘యూనిఫైడ్ సంక్షేమ కార్డు’ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాల వివరాలు, ఏ పౌరుడికి ఎంత లబ్ధి చేకూరుతుందో స్పష్టంగా తెలుస్తుంది. లబ్ధిదారుల డేటా, అలాగే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.