HYD: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) 19వ యువజన మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో నిర్వహించనున్నట్లు ATA ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా తదితరులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి మహాసభలకు హాజరు కావాలని ఆహ్వానించారు.