BDK: సోదరభావం, ప్రేమ, త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం మండలంలో జరుగుతున్న బక్రీద్ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొనాలని తెలిపారు. ప్రజలందరూ పరస్పర గౌరవ భావంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.