RR జట్టు నుంచి యశస్వి జైస్వాల్ తప్పుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వైభవ్ నీడలో జైస్వాల్ పదేపదే మరుగున పడిపోకూడదని సూచించాడు. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించగల ప్రత్యేక గుర్తింపు ఉన్న జైస్వాల్కు ముంబై జట్టు సరిగ్గా సరిపోతుందని రాయుడు పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.