MLG: జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు తాడ్వాయి మండలం ఒడ్డుగూడెం గ్రామంలో గురువారం తాటి కృష్ణ గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. ఇటీవల భర్తను కోల్పోయిన బాబురావు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించగా, చెట్టుపై నుంచి జారి గాయపడిన యాప సంతోష్‌ను పరామర్శించి సహాయం చేశారు. అనంతరం గ్రామ సమస్యలపై చర్చించారు.