BDK: సుజాతనగర్ మండలం, జామ్లాతండా 4వ వార్డు సభ్యురాలు మాలోత్ సుజాతబాయి, ఆమె భర్త మాలోత్ రమేష్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం సీపీఐలో చేరిన వీరు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మళ్లీ సొంత గూటికి గురువారం చేరినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.