పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌కు ప్రభుత్వం ఎస్పీ హోదాకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసి, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కొత్త పోస్టింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. గత రెండేళ్లుగా పల్నాడులో సేవలందిస్తున్న ఆయన పలు కీలక కేసుల దర్యాప్తు, ఛేదనలో ప్రతిభ కనబరిచారు.