MNCL: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన (TRS)లో చెన్నూర్‌కు చెందిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ గురువారం చేరారు. రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయనతో పాటు ముఖ్య నాయకులు పలువురు కలిసి టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో TRS బలోపేతానికి కృషి చేస్తామన్నారు.