CTR: ఎస్ఆర్ పురం మండలం గంగమ్మగుడి గ్రామంలో మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.