MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రీ ప్రైమరీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. మొత్తం 308 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 132 పాఠశాలలు, మెదక్ జిల్లాకు 90, సిద్దిపేట జిల్లాకు 86 పాఠశాలలు కేటాయించారు.