AP: ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి 3 రాజధానులను తెరపైకి తెచ్చిన జగన్కు..2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి అచ్చెన్నాయడు అన్నారు. 2014-19 మధ్య APలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. YCP అబద్ధాలను ప్రజలు నమ్మడం వల్లే 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఈ సారి జగన్కు ఆ ఛాన్స్ ఇవ్వమని, YCPని పాతాళానికి పాతిపెడతామని హెచ్చరించారు.