ATP: ఎన్టీఆర్ కాలం నుంచి తమ కుటుంబం మూడు తరాలుగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్తో తమ తాత కలిసి పనిచేసిన పాత ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, ఆ జ్ఞాపకాలు తమ కుటుంబానికి ఎప్పటికీ గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.