NTR: స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వనరులు, అవకాశాలు, నైపుణ్యమున్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోందన్నారు.