W.G: కాళ్ళ మండలం కోపల్లెలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, భద్రతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా ఆర్ అండ్ బీ అధికారి ఎ.శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ అర్జునరాజు పాల్గొన్నారు.