AP: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని MP అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. YSR జిల్లా వేముల మండలంలో పర్యటించిన ఆయన, గాలి వానతో నేలకొరిగిన అరటి పంటను పరిశీలించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి రైతుకూ ప్రభుత్వమే పంటల బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు.